నీ జ్ఞాపకాల తో

నువ్వు నాకు గుర్తొస్తే ఎవరూ ఉండరు, నీ జ్ఞాపకం తప్ప! నువ్వు నా పక్కనుంటే అసలు నేనే ఉండను. నువ్వు తప్ప!



నేనేమైపోతున్నా....మాటలు పెదాలు దాటటం లేదెందుకు..
ఏంజరుగుతోంది నాలో నా లోని సంఘర్షన..
నన్ను నన్ను గాఉండనీయడంలేదు...
కారణం
..నీవే..
ఎప్పుడూ ఏదోటి మాట్ల్డాడే నేను..
మాటలు రాని మూగవాని గా అయిపోతున్నా..
నేనెక్కడ ఉన్నా అక్కడ సందడిగా సరదాగా ఉంటుంది..
ఇప్పుడు మౌనంగా మరోలోకంలో ఉన్నట్టుంటున్నా..
నవ్వుతూ నవ్విస్తూ ఉండేనేను అసలు మాటల్నే మర్చిపోతున్నా..
అన్నీ నీ జ్ఞాపకాలే..నీ తలపులే
ఏదొ అవుతోంది.. నాకు ఎమౌతోందో అర్దంకావడంలేదు..
నీవు లేని నేను లేను అని మాత్రం తెలుస్తోంది..
నన్ను నన్నుగా..నాకు నేనుగా ..
నాలో నేనుగా ఏమీలేని వానిగా ఒంటరిగా నీఆలోచనలతో...?

పరిచయాలు చేసే జ్ఞాపకాలు ఎన్నో,
జ్ఞాపకాలు మిగిలిచే గుర్తులుఎన్నో,
నా చిన్ని జీవతంలో ఎన్ని పరిచయాలు ఉన్నా,
కలకాలం ఉండే తియ్యనీ స్నేహం నీది,
ఆలాంటీ నా ప్రియా నేస్తానికీ
నా పుట్టినరోజు శుభాకాంక్షలు...........

ఫ్రతీ క్షణం నీ చిరు నవ్వుల స్నేహన్ని ఆశీస్తూ...
-----------
నీ బాలు
(ఓ నేస్తాం
పుట్టినరోజు కోసం చాలా రొజులు తరువాత........)


ప్రేమకు కానుక ప్రేమే!!

ప్రేమను మించిన కానుక ఇంకేం వుంటుంది? చెప్పండి.

ఆకర్షణకు, ప్రేమకు తేడా తెలియని వాళ్లకు ప్రేమ అంటే చెప్పినా అర్ధం కాదు.

నిజమైన ప్రేమలోని స్వచ్చత, అనుభూతి ఆస్వాదించాలే కాని మాటలకందనిది.

అమ్మ ప్రేమ లోని కమ్మదనం, నాన్న ప్రేమ లోని నమ్మకం,

అన్నదమ్ముల ప్రేమలోని ఆప్యాయత, అక్కచెల్లెల్ల ప్రేమలోని అనుబంధం,

స్నేహితుల, సన్నిహితుల ప్రేమలోని సహకారం,

ఇలా అందరి అనురాగం, అభిమానం కలగలిసిన
స్వచ్చమైన వెలకట్టలేని ప్రేమే ప్రేమకు ఇవ్వదగిన కానుక!!

అందరికి ప్రేమికులరోజు శుభాకాంక్షలు.....


నన్ను నేను మోసం చేసుకుంటూ నిన్ను నేను మోసం చేస్తూ,

నీవు నన్ను మోసం చేస్తూ నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ...

నా కోసం నువ్వు అబద్దాలాడుతూ, నీ కోసం నేను అబద్దాలాడుతూ

బలే సాగుతున్నా మన ఈ ప్రయాణంలో తరువాతి మజిలీ ఏమిటో మరి...


గడియారం నుండి జారిపోతున్న ప్రతీ

క్షణాన్నిఒడిసి పట్టి గుండెల్లో బంధించేస్తున్నాను -అనుభూతుల రూపం లో

ప్రతీ క్షణం వెళుతూ వెళుతూ తనవిలువను పెంచుకుంటోంది -గతమై మిగిలి

నేడు లో మరణించింది... అయినా

నిన్న లో కుడా గొప్ప గా బ్రతికేస్తుంది -చరిత్ర లా

రెండు హృదయాల మూగ భాష ప్రేమ
నాలుగు కన్నుల ఎదురుచూపు ప్రేమ
ఎన్నో తెలియని భావాల బాధ ప్రేమ
ఛిలిపిదనాల తీయనైన‌ అనుభవం ప్రేమ
మాట్లాడగలిగే మౌనం ప్రేమ
యుగాల నిరీక్షణే ప్రేమ
మనసైన‌ వాడిని రెప్పల వెనుక దాచేది ప్రేమ
మరణాన్ని సైతం ఆహ్వానించేది ప్రేమ
ఆరాధించేది ప్రేమ
ఆరాటపడేది ప్రేమ
అంతు తెలియనిది ప్రేమ
అంతం లేనిది ప్రేమ
ఇది నాకు తెలిసిన ప్రేమ
నేను అక్షర భాష్యం చెప్పగలిగిన ప్రేమ
కాని...
భాష తెలియని భావాలెన్నో
ప్రేమన్న రెండు అక్షరాల పదం
ఆ ప్రేమ కై ఎదురు చూసే నీ బాలఆవి




-- నీ ప్రేమ భవంతి కో ఇటుక ...
నీ విశాల నేత్రాలకి కాటుక,

నీ పంజరాన గువ్వ...

కాలిలోన మువ్వ,

చేతిలోన పరుసు...

మెడలోన గొలుసు ,

కొప్పులోన పువ్వు...

పెదవిపైన నవ్వు ,

ఏదైనా ఓ క్షణమైనా చాలు.......

welcome to my blog

welcome to my blog
we create this blog

About this blog

clock

welcome to balaavi.blogspot.com